హైదరాబాద్: 28°C
భక్తి

శైవక్షేత్రాల్లో మార్మోగుతున్న శివనామస్మరణ

కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని  శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. వేములవాడ, కాళేశ్వరం, కీసరగుట్ట, వేయి స్తంభాల గుడికి భారీగా తరలొచ్చారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, పంచారామ క్షేత్రాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూలైన్లు, దర్శన ఏర్పాట్లు చేశారు. గోదావరి, కృష్ణా నదీ తీరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్నారు. తులసి, ఉసిరి చెట్ల వద్ద దీపారాధన చేస్తున్నారు.