హైదరాబాద్: 28°C
భక్తి

చంద్రుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే?

చంద్రోదయం అయ్యాక స్నానం చేసి శుభ్రమైన దుస్తులు వేసుకోవాలి. ఒక పాత్రలో మంచి నీళ్లు తీసుకుని అందులో కొంచెం పచ్చి పాలు, పచ్చి బియ్యం, పంచదార లేదా తెల్ల పువ్వులు వేసుకోవచ్చు. చంద్రుడి వైపు తిరిగి సన్నని నీటి ధారను వదులుతూ ఓం సోమాయ నమః లేదా ఓం సో సోమాయ నమః మంత్రాన్ని జపించాలి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు నీళ్లు పాదాలపై పడకుండా జాగ్రత్త పడాలి. చివరగా మనశ్శాంతి, ఆనందం, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించాలి.