హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 75,640 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.13 కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు 23,439 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.