ఏడాదిలోని 365 రోజులకు ప్రతీకగా కార్తీక పౌర్ణమినాడు 365 వత్తుల దీపం పెడుతుంటారు. ఏడాది పొడవునా ఏదైనా ఆటంకంతో రోజూ దీపం వెలిగించలేని వారు ఇవాళ 365 వత్తుల దీపం వెలిగిస్తే ఆ లోటు తీరుతుందని, పూజా ఫలితం లభిస్తుందని నమ్ముతారు. ఆవు నెయ్యిలో 365 వత్తులను నానబెట్టి, వాటిని సూర్యాస్తమయం తర్వాత గుడిలో లేదా తులసి కోట దగ్గర వెలిగిస్తే ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
భక్తి
ఇవాళ 365 వత్తుల దీపం ఎందుకు వెలిగిస్తారు?


