హైదరాబాద్: 28°C
వార్తలు

పీజీ డెంటల్‌ స్ట్రే కౌన్సెలింగ్‌‌కు దరఖాస్తుల ఆహ్వానం

AP: ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న పీజీ డెంటల్ సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కన్వీనర్/యాజమాన్య సీట్లకు నిర్వహించిన స్ట్రే (మిగులు) రౌండ్-1 కౌన్సెలింగ్‌కు దరఖాస్తులు కోరుతూ NTR హెల్త్ వర్సిటీ ప్రకటన ఇచ్చింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఇవాళ రాత్రి 9 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొంది.