హైదరాబాద్: 28°C
వార్తలు

కలెక్టర్లు, ఎస్పీలతో నేడు SEC వీడియో కాన్ఫరెన్స్‌

AP: కలెక్టర్లు, ఎస్పీలతో SEC అనిల్ చంద్ర పునేఠా ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి శిక్షణ, సామాగ్రి పంపిణీ, రవాణా, పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాట్ల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఈ నెల 26న తొలిదశలో 3,949 గ్రామ పంచాయతీలకు, 23 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్‌ జరగనుంది.