తమిళనాడులో సినీనటి త్రిష పేరుతో ‘ఇళయ పురట్చి తలైవి పేరవై’ అనే సేవా సంస్థ ప్రారంభమైంది. తిరునెల్వేలిలో త్రిష అభిమాని రాజగోపాల్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. జయలలిత తరహా నాయకత్వ లక్షణాలు త్రిషలో ఉన్నాయని, ఆమె రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. త్రిష ఫొటోతో లోగోను కూడా ఆవిష్కరించారు. అయితే ఈ సంస్థ ఏర్పాటుకు త్రిష అనుమతి ఉందా లేదా అన్నది స్పష్టత లేదు.
వార్తలు
త్రిష పేరుతో తమిళనాడులో సేవా సంస్థ


