హైదరాబాద్: 28°C
భక్తి

సర్వపాపాలను హరించే 'జ్వాలాతోరణం'

కార్తిక పౌర్ణమి సాయంత్రం వేళ ప్రతి శివాలయ ప్రాంగణంలో 'జ్వాలాతోరణం' వేడుక ఘనంగా నిర్వహిస్తారు. ఇవాళ జ్వాలాతోరణాన్ని దర్శించుకోవడం, దాని కింది నుంచి దాటడం వల్ల సర్వపాపాలు హరించుకుపోతాయని, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, అపమృత్యువు దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. జ్వాలా తోరణం కింద నుంచి వెళ్లడం వల్ల నరకద్వార ప్రవేశం తొలగుతుందని పురాణాలు చెబుతున్నాయి.