హైదరాబాద్: 28°C
భక్తి

ఈనెల 27న వైకుంఠద్వార దర్శన టికెట్లు

AP: ఈ నెల 27న వైకుంఠ ద్వార దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. తొలి రెండ్రోజులు ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో, మిగతా 8 రోజులు నేరుగా వచ్చే భక్తులకు ఎలాంటి టోకెన్లు లేకుండానే దర్శనం కల్పించనుంది. 10 రోజుల పాటు రోజుకు 15 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేయనుంది. ఈ నెల 26న తిరుమల పర్యటనకు వస్తున్న సీఎంతో చర్చించాక టికెట్లను విడుదల చేయనున్నారు.