కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం పరమేశ్వరుడికి ప్రీతికరమైనది, శక్తివంతమైనది. శివకేశవుల ఆరాధన, ఉపవాసం, దీపారాధన, దానధర్మాలతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఉదయం లేదా ప్రదోష కాలంలో శివాలయాలకు వెళ్లి రుద్రాభిషేకం, బిల్వార్చన చేస్తారు. ఉమామహేశ్వరులను పూజించడం వల్ల సమస్యలు తొలగి శుభాలు కలుగుతాయని నమ్మకం. 'ఓం నమః శివాయ' పంచాక్షరి మంత్రాన్ని జపించడం, శివ స్తోత్రాలు పఠించడం శ్రేయస్కరం.
భక్తి
కార్తీక సోమవారం.. ఇలా చేస్తే శ్రేయస్కరం?


