TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి కొండపై భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఆలయ మాడవీధులు భక్తులతో సందడిగా మారాయి. ఆదివారం సెలవు రోజు, కార్తీకమాసం కావడంతో హైదరాబాద్ నగరవాసులతో పాటు ఆయా జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలొచ్చారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని వసతులు కల్పించారు.
భక్తి
యాదగిరిగుట్టలో పెరిగిన భక్తుల రద్దీ


