KKD: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కొండపై అంతర్జాతీయ వివాహ వేడుక ఘనంగా జరిగింది. దక్షిణ కొరియాకు చెందిన యువతి, విశాఖపట్నానికి చెందిన యువకుడిని హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహమాడింది. సత్యదేవుని సన్నిధిలో జరిగిన ఈ వివాహ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో అన్నవరం క్షేత్ర విశిష్టతను చాటిచెప్పడం పలువురిని ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సత్యదేవుని సన్నిధిలో అంతర్జాతీయ వివాహం


