కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని మరో మహాశివరాత్రిగా భక్తులు పరిగణిస్తారు. పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథి ఈనెల 23వ తేదీ రాత్రి 11:42 గంటలకు ప్రారంభమై.. 24వ తేదీ రాత్రి 8:23 గంటలకు ముగుస్తుంది. దీంతో 24వ తేదీ(మంగళవారం) పౌర్ణమిని జరుపుకుంటారు. ఆవు నెయ్యిలో తడిపిన 360 వత్తుల దీపం వెలిగించాలి. తులసి కోట, ఉసిరి చెట్టు వద్ద దీపారాధన చేస్తే సకల దోషాలు తొలుగుతాయి. సాయంత్రం శివాలయాల్లో జ్వాలాతోరణం దర్శించుకోవాలి.
భక్తి
కార్తీక పౌర్ణమి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి?


