హైదరాబాద్: 28°C
తెలంగాణ

విరిగిన పిల్లర్‌తో పొంచి ఉన్న ప్రమాదం

NRML: ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్-హరిజనవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రవేశ ద్వారం గేటు పిల్లర్ ధ్వంసమై కూలిపోయే పరిస్థితి నెలకొంది. గేటు పిల్లర్ మధ్యలో విరిగి బలహీనంగా మారింది. విద్యార్థులు ఇదే ప్రవేశ ద్వారం గుండా రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. దెబ్బతిన్న గేటు పిల్లర్ ఆక స్మాత్తుగా కూలిపడితే పెను ప్రమాదం జరిగే అవ కాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.