హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ పత్రాలతో రెండెకరాల భూమి స్వాహాకు యత్నం

SRD: భూ భారతి పోర్టల్ ద్వారా భూ రికార్డులను అక్రమంగా మార్చి, నకిలీ ఆధార్ వివరాలతో ఇస్మాయిల్ ఖాన్ పేట్ శివారులోని 2 ఎకరాల భూమిని విక్రయించేందుకు యత్నించిన ముగ్గురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అరెస్టయిన వారిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. భూ లావాదేవీల సమయంలో పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.