హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత

మెదక్ జిల్లాలో చలి ప్రభావం క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ డవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వివరాల ప్రకారం, నవంబర్ 21 నుంచి 22 వరకు నాగాపూర్‌లో అత్యల్పంగా 17.3 డిగ్రీలు, మెదక్ ఆర్డీవో కార్యాలయం వద్ద 17.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో వర్షపాతం సున్నాగా నమోదు కాగా, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.