MLG: గిరిజన విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో ప్రత్యేక దృష్టి సారించారు. ఆదివారం జనగామ జిల్లాలోని మూడు ఆశ్రమ పాఠశాలలను, హనుమకొండ బాలసముద్రంలోని STEAM-60 కార్యక్రమాన్ని సందర్శించి విద్యార్థుల చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను పరిశీలించారు. నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
వార్తలు
పాఠశాలల తనిఖీలో పీఓ


