హైదరాబాద్: 28°C
వార్తలు

జడ్పీ ఛైర్మన్ విజయంతో బడుగువానిలంకలో సంబరాలు

కోనసీమ జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా గొల్లపల్లి అమూల్య బాధ్యతలు చేపట్టడంతో ఆమె అమ్మమ్మ గ్రామం ఆలమూరు మండలం బడుగువానిలంకలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అమూల్య తల్లి భాగ్యవతి స్వగ్రామం కావడంతో నేతల కుటుంబ బంధువులు ఆమె విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు అమూల్యను కలిసి అభినందించి, గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.