హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 81,516 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 25,547 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.