హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాయితీ చాటుకున్న జనగామ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్

JN: బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన జలగం ఉపేంద్ర గత నెల 29న రాత్రి జనగామ రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంపై సిరి గోల్డ్ కంపెనీకి చెందిన విలువైన అగ్రిమెంట్ పత్రాలను మర్చిపోయారు. విధుల్లో ఉన్న RPF కానిస్టేబుల్ మహేందర్ వాటిని గుర్తించి భద్రపరిచారు. పత్రాల్లోని వివరాల ఆధారంగా ఆమెకు సమాచారం అందించగా.. స్టేషన్‌కు వచ్చిన జలగం ఉపేంద్రకు అగ్రిమెంట్ పత్రాలను అందజేశారు.