హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాకతీయుల కాలం నాటి మహాదేవుని ఆలయం

KMR: జిల్లా దోమకొండ కోటలోని మహాదేవుని ఆలయం చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతను కలిగి ఉంది. సుమారు 750 నుంచి 800 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం వాస్తు, శిల్పకళకు అద్దం పడుతోంది. ఆలయ స్తంభాలు, పైకప్పు అద్భుత నిర్మాణశైలితో ఆకట్టుకుంటాయి. రాణి రుద్రమదేవి సైతం ఈ ఆలయాన్ని సందర్శించినట్లు చెబుతారు.