BDK: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రసాదాలకు భక్తుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే నిత్యావసర సరకుల ధరలు పెరుగుతుండటంతో ప్రసాదాల తయారీ ఖర్చులపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. నెయ్యి ధర త్వరలోనే రూ.690కి చేరనుండటంతో, ఆ భారం ప్రసాదాలపై పడే ప్రమాదం కనిపిస్తోంది. ఒకవేళ నెయ్యి ధర మరింత పెరిగితే, ప్రస్తుతం ఉన్న ధరలకే ప్రసాదాలను విక్రయించడం ఆలయానికి భారంగా మారనుంది.
తెలంగాణ
భద్రాద్రి రామయ్య ప్రసాదాలపై ధరల ప్రభావం..!


