హైదరాబాద్: 28°C
వార్తలు

రక్షణ శాఖ వాట్సాప్ గ్రూపుల్లో పాక్ గూఢచారులు

భారత సాయుధ బలగాలు, రక్షణ శాఖ అధికారుల ప్రైవేట్ వాట్సాప్ గ్రూపుల్లోకి పాక్ గూఢచారులు చొరబడినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. భారత మొబైల్ నంబర్లను స్పూఫ్ చేసి 13-14 గ్రూపుల్లో ప్రవేశించినట్లు అనుమానిస్తున్నాయి. గ్రూపుల్లో చర్చలు, సమాచారం, డాక్యుమెంట్లను పాక్ గూఢచారులు నిశ్శబ్దంగా గమనిస్తున్నారని నిఘా సంస్థలు తెలిపాయి. దీంతో సోషల్ మీడియా గ్రూపుల ఆడిట్‌కు ఆదేశించాయి.