హైదరాబాద్: 28°C
వార్తలు

పంచాయతీ పోరు.. నేడు నామినేషన్ల పరిశీలన

AP: మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు నిన్నటితో ముగియగా.. ఇవాళ నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. ఈ విడతలో 25 జిల్లాలో 4,244 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. 27న పోటీలో అభ్యర్థుల తుది జాబితా ప్రచురిస్తారు. DEC 2న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.