హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు

ATP: తాడిపత్రిలోని ప్రసిద్ధ శివ క్షేత్రమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి బిల్వ పత్రముల నడుమ ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ఆవరణలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక మాస దీపాలను వెలిగించి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.