AP: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భక్తులు పాతాళగంగలో స్నానమాచరించి మల్లికార్జున, భ్రమరాంబ స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులుతీరారు. రాత్రి 7 గంటలకు జ్వాలా తోరణోత్సవం నిర్వహించనున్నారు. జ్వాలా తోరణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. తోరణం కాలిన తర్వాత భస్మాన్ని భక్తులు సేకరించి తిలకంగా ధరిస్తారు. దీనివల్ల పాపాలు తొలగి ఆయుష్షు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.
భక్తి
శ్రీశైలంలో భక్తజనసంద్రం.. రాత్రికి జ్వాలాతోరణం


