హైదరాబాద్: 28°C
క్రీడలు

'నాన్న కాదు.. అతడే నా ఫేవరెట్ క్రికెటర్‌'

టీమిండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్, తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడటం కోహ్లీని చూసే నేర్చుకున్నానని పేర్కొన్నాడు. 'సెహ్వాగ్ 2.0'గా కాకుండా, ఆర్యవీర్‌గా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యమన్నాడు. ఇటీవల U-19 ఆసియా కప్‌లో ఆర్యవీర్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచాడు.