పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ బెంగళూరులో నిర్వహించబోయే కాన్సర్ట్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపు ఈ-మెయిల్ హుబ్బళ్లి-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అధికారిక ఐడీకి అందింది. నవంబర్ 29న బెంగళూరులో జరిగే కాన్సర్ట్‌లో బాంబు పేలుడు సంభవిస్తుందని అందులో హెచ్చరించారు. అలాగే, 'ఖలిస్థాన్ జిందాబాద్' అనే నినాదాన్ని కూడా జతచేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
క్రీడలు
దిల్జిత్ దోసాంజ్ కాన్సర్ట్‌కు బాంబు బెదిరింపు


