హైదరాబాద్: 28°C
క్రీడలు

ఉమ్మిపై నిషేధం ఎత్తివేయాలి: శుభ్‌మన్‌ గిల్‌

బంతికి ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ అభిప్రాయపడ్డాడు. కరోనా సమయంలో తీసుకొచ్చిన ఈ నిబంధనను ఇప్పుడు కొనసాగించాల్సిన అవసరం లేదన్నాడు. నిర్జీవమైన పిచ్‌లపై బంతి బౌలర్లకు సహకరించాలంటే నిషేధాన్ని తొలగించాలని సూచించాడు. 25-30 ఓవర్లకే బంతి మెత్తబడటం, ఆకారం మారడంతో బౌలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నాడు.