సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ కెప్టెన్ ప్రియాంశ్ ఆర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది సంచలనం సృష్టించాడు. మొత్తంగా 68 బంతుల్లో 181 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 19 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 275 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రియాంశ్ IPLలో పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
క్రీడలు
సిక్సర్ల సునామీ.. 68 బంతుల్లో 181 పరుగులు!


