హైదరాబాద్: 28°C
క్రీడలు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్-ఏ, యూఏఈ-ఏ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ కెప్టెన్ ఎం. అఫ్తాబ్ ఆలం తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో పాకిస్థాన్ షాహీన్స్ చేతిలో భారత్-ఏ 48 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈసారి గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుగైన ప్రదర్శన చేయాలని జట్టు ఆశిస్తోంది.