ADB: ప్రభుత్వం విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ యాదవ్ అన్నారు. ఇవాళ ఆదిలాబాద్ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఎదుట మీడియాతో ఆయన మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 25న కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి


