హైదరాబాద్: 28°C
తెలంగాణ

హామీలు అమలు చేయకుంటే అడ్డుకుంటాం: బీఆర్ఎస్

BDK: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తోందని బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు గద్దల రామకృష్ణ విమర్శించారు. రాజీవ్ యువ వికాసం రుణాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, కళ్యాణలక్ష్మి చెక్కులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుని ఆందోళన చేస్తామని హెచ్చరించారు.