హైదరాబాద్: 28°C
తెలంగాణ

అపార్ నమోదులో సాంకేతిక చిక్కులు

JN: జాతీయ విద్యావిధానం-2020లో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన అపార్ కార్డుల నమోదులో సాంకేతిక సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జనగామ జిల్లాలో 78.02 శాతం నమోదుతో రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచింది. ఆధార్, యూడైస్ వివరాల్లో వ్యత్యాసాల వల్ల కొందరికి కార్డులు జనరేట్ కావడం లేదు. దీంతో తప్పుల సవరణ కోసం తల్లిదండ్రులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.