హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్టేజీల వద్ద ఆగని ఆర్టీసీ బస్సులు

KMM: ఖమ్మం–కోదాడ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సులు స్టేజీల వద్ద ఆగకుండా వెళ్లిపోతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీంతో మహిళలు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బస్సుల్లో ఖాళీ సీట్లు ఉన్నప్పటికీ కొన్ని సర్వీసులు గ్రామాల స్టేజీల వద్ద ఆగకుండా వేగంగా వెళ్లిపోతున్నాయని చెబున్నారు. బస్సుల రాకపోకలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, ప్రతి స్టేజీలో బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని మహిళలు, ప్రయాణికులు కోరుతున్నారు.