హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోగులాంబ ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే

GDWL: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ జోగులాంబ దేవి అమ్మవారు, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేని ఆహ్వానించారు. స్వామి అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.