తమిళనాడు తిరుపరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో సెక్షన్ 144 అమలు చేశారు. అలాగే సహాయ కమిషనర్ ఇనికో దివ్యన నేతృత్వంలో కొండ చుట్టూ నలుగురు DIGలు, 7 SPలు, 10 మంది అదనపు SPలు, 45 మంది DSPలు, 100 మందికి పైబడి ఇన్‌స్పెక్టర్లు మొత్తం 7000 మంది పోలీసులను మోహరించారు.
వార్తలు
కార్తీక దీపం వివాదం.. సెక్షన్ 144 అమలు


