TG: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఈనెల 26న CM రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్నారు. కోటిమంది మహిళలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గ్రామాల్లో 65 లక్షలు, పట్టణాల్లో 35 లక్షల మందికి పంపిణీ చేయనున్నారు. పంపిణీకి 95 లక్షల పాలిస్టర్ చీరలు సిద్ధంగా ఉంచారు. రేషన్ కార్డు ఉన్న 18 ఏళ్లు నిండిన మహిళలందరూ చీరలను పొందేందుకు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వార్తలు
కోటిమంది మహిళలకు 'ఇందిరమ్మ చీరలు'


