హైదరాబాద్: 28°C
తెలంగాణ

KCR కోసం ఎర్రవల్లికి పాదయాత్ర

రంగారెడ్డి: కేసీఆర్ మళ్లీ సీఎం కావాలనే ఆకాంక్షతో దాయపొంతులపల్లి బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు తిరుపతయ్య ఎర్రవల్లికి పాదయాత్రగా బయలుదేరారు. మంగళవారం షాద్‌నగర్‌లోని పరిగి రోడ్డు పోచమ్మ ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఫరూఖ్‌నగర్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని పేర్కొన్నారు.