హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక పౌర్ణమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

HNK: హన్మకొండ నగరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా వేయి స్తంభాల దేవాలయం, సిద్ధేశ్వరాలయం, భద్రకాళి, పద్మాక్షి తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరి స్వామివార్లను దర్శించుకున్నారు. వేయి స్తంభాల ఆలయ ప్రాంగణంలోని మర్రిచెట్టు కింద భక్తులు దీపారాధనలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.