హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు బొల్లారం విద్యార్థి

SRD: బొల్లారం డివిజన్ పరిధిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలకు చెందిన సీనియర్ సీఈసీ విద్యార్థిని నిషాకుమారి జూనియర్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి తెలిపారు. ఈ సందర్భంగా నిషాకుమారిని ప్రిన్సిపల్‌తో పాటు, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.