హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొలాల్లో కేబుల్ వైర్ల చోరీ.. రైతుల్లో ఆందోళన

SRPT: పీఏపల్లి మండలం అంగడిపేట పరిధిలో ఈరోజు 40 వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. గుర్తుతెలియని దుండగులు ఒక్కో మోటారు వద్ద 40 మీటర్ల చొప్పున వైర్లు కత్తిరించి ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని రైతులు తెలిపారు. మంగళవారం ఉదయం చోరీని గుర్తించిన రైతులు, పంటలకు నీరందక ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.