హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తగట్టులో డిసెంబర్ 3న బహిరంగ వేలం పాట

KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు శ్రీ మత్స్యగిరీంద్రస్వామి దేవస్థానంలో వివిధ హక్కుల కేటాయింపునకు అధికారులు సిద్ధమయ్యారు. కొబ్బరికాయలు, పూజా సామగ్రి విక్రయ హక్కులతో పాటు, కళ్యాణ మండపం లీజు కోసం డిసెంబర్ 3న ఉదయం 11 గంటలకు సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఒక్కో హక్కుకు రూ.50 వేల డిపాజిట్ నిర్ణయించినట్లు ఈవో ఉడుతల వెంకన్న తెలిపారు.