హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక పౌర్ణమి.. 365 దీపాలతో భక్తుల దీపారాధన

WGL: కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలోని శివనగర్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం శ్రీ రామలింగేశ్వర స్వామికి కుటుంబ సమేతంగా పంచామృత అభిషేకాలు చేశారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం పవిత్రమనే విశ్వాసంతో భక్తులు 365 దీపాలను వెలిగించి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు.