ADB: వంతెనపై ఇనుపచువ్వలు పైకి తేలి ప్రమాదకరంగా మారి నెలలు గడుస్తోంది. పట్టణంలోని గాంధీనగర్ కాలనీ నుంచి రణదివేనగర్ మధ్యన ఆరేళ్ల కిందట నిర్మించిన ఈ వంతెనపై నుంచి నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళ్లే సమయంలో ఇనుప చువ్వల వద్ద టైర్లు ఇరుక్కోవడంతో అటు ఇటు కదిలి పడే ప్రమాదం ఉంటోందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ
ఇనుపచువ్వలు పైకి తేలి ప్రమాదంగా మారిన వంతెన రోడ్డు


