హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పలు గ్రామాల్లో కన్నులపండువగా కార్తీక పౌర్ణమి

SRD: కొండాపూర్ (మం)లోని పలు గ్రామాలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివుడికి, శ్రీమహా విష్ణువుకి ప్రీతికరమైన రోజును భక్తిశ్రద్ధలతో రామనామ సంకీర్తన చేస్తూ ఘనంగా నిర్వహించుకున్నారు. పరమశివుడు త్రిపురాసురులను సంహరించిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనికి త్రిపురి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ఎత్తిన పుణ్యతిథి ఇదేనని పండితులు వివరించారు.