నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం రాచాపూర్ నుంచి పీచర వెళ్లే మార్గంలో పలు చోట్ల మలుపులు ప్రమాదకరంగా మారాయి. రహదారిపైకి పిచ్చిమొక్కలు రావటంతో మరింత ఇరుకుగా మారింది. ఎదరెదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. అధికారులు స్పందించి ప్రమాదాలు నివారించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్డుపైకి పిచ్చిమొక్కలు.. పొంచి ఉన్న ప్రమాదం


