SRCL: ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో పందుల నివారణకు పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి ఇవాళ రేపాక రమేష్ (27) అనే యువ రైతు మృతి చెందాడు. నారుమడిలో నీరు తొలగిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. పొలాల వద్ద ప్రమాదకరంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయవద్దన్నారు.
తెలంగాణ
విద్యుత్ తీగ తగిలి యువ రైతు మృతి


