హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

NRML: బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సంపత్ (20) సోమవారం రాత్రి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ఇతను, మిత్రుడు భోజనానికి వెళ్లిన సమయంలో తలుపులు వేసుకుని ఉరేసుకున్నాడు. భైంసా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.