JGL: ధర్మపురి పట్టణంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇవాళ ఉదయం ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని రంగురంగు పూలతో అలంకరించి హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రాంగణం గోవింద నామాలతో మారుమోగింది.
తెలంగాణ
VIDEO: శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ


